• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పైడిభీమవరం సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు

SKLM: రణస్థలం మండల పరిధిలోని పైడిభీమవరం సచివాలయాన్ని శుక్రవారం ఈవోపీఆర్డీ వి. ప్రకాష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, రికార్డ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

February 7, 2025 / 01:12 PM IST

ఘనంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారోత్సవాలు

SKLM: కవిటి మండలం లోల్లపుట్టుక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అదే విధంగా ఈ నెల 9 వరకు ఈ వారోత్సవాల నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవ, తిరువీధి కార్యక్రమం, హరికథ భజన, తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

February 7, 2025 / 01:09 PM IST

కులగణన సర్వేపై బీజేపీ వినతి

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే బీసీల ఎదుగుదలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి కొట్టే విధంగా, రాజకీయంగా అణిచివేసే విదంగా ఉన్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు. 

February 7, 2025 / 01:06 PM IST

గుడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలం బొబ్బిలిపాడు గ్రామంలో అంకమ్మ తల్లి పోతురాజు గ్రామదేవతల దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు. అనంతరం భక్తులకు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేలాదిమంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

February 7, 2025 / 12:59 PM IST

చెట్టుపల్లి తీర్థం పై సీఐ సమీక్ష

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఈనెల 8, 9, 10వ తారీకుల్లో జరిగే గౌరీ పరమేశ్వరుల తీర్థ మహోత్సవం నేపథ్యంలో రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్సై రాజారావు గ్రామ పెద్దలతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. స్టేజ్ ప్రోగ్రాములు ఉన్న రోజున పోలీసు అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు.

February 7, 2025 / 12:53 PM IST

‘నిత్యవసర సరుకులు పంపిణీ’

ASR: డుంబ్రిగూడ మండలంలో మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణకుమారి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె నిరుపేద గిరిజనులను గుర్తించి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కష్టాల్లో ఉన్న గిరిజనులకు తమ వంతు ఎంతో కొంత సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.

February 7, 2025 / 12:53 PM IST

మామిడి సాగు రైతులకు జిల్లా ఉద్యానవన అధికారి సూచనలు

KMM: జిల్లాలో మామిడి సాగును 32,105 ఎకరాలలో సాగుచేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి యం.వి. మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం మామిడి పూత నుంచి పిందె దశలో ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిక్కుడు పురుగు, తేనె మంచు పురుగు, తామర, బూడిద రోగం, పక్షి కన్ను తెగులు వంటి నివారణకు సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.

February 7, 2025 / 12:52 PM IST

పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

SKLM: మన్నయ్యపేట గ్రామంలో పగటిపూట నిత్యం వీధి దీపాలు వెలుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీపాలు వెలగడంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగడం వలన పంచాయతీకి అదనపు భారం పడుతుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పగటిపూట విద్యుత్ దీపాలు వెలగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

February 7, 2025 / 12:47 PM IST

అల్లూరి విగ్రహం ఆవిష్కరణ

AKP: నక్కపల్లి మండలం రేబాక గ్రామంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, జనసేన నేత గెడ్డం బుజ్జి, బీజేపీ నాయకులు పాకలపాటి రవిరాజు, అల్లూరి మనమడు రాజు, సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

February 7, 2025 / 12:36 PM IST

కూసుమంచి ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు

KMM: కూసుమంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. మండల వైద్యాధికారిపై ఆర్థిక ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సరం పల్స్ పోలియో నిధులు పల్లెదావఖాన నిధుల అక్రమ వినియోగంపై విచారణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

February 7, 2025 / 12:33 PM IST

సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు

కృష్ణా: నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని ఎస్సై అర్జున్ అన్నారు. ఎస్సై మాట్లాడుతూ.. పెనుగంచిప్రోలు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

February 7, 2025 / 12:21 PM IST

బెంగుళూరు బయలుదేరిన వైఎస్ జగన్

కృష్ణా: మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం బెంగుళూరు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి బెంగుళూరు ప్రయాణమయ్యారు. కాగా జగన్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా వారికి నమస్కరించిన ఆయన బెంగుళూరు పయనమయ్యారు.

February 7, 2025 / 12:19 PM IST

తాగడానికి తారు రోడ్డు.. స్కూల్‌కు మట్టి రోడ్డు

NDL: తాగడానికి వెళ్లే వారి కోసం తారు రోడ్డు, స్కూల్‌కు వెళ్లి చదువుకునే విద్యార్థులకు మాత్రం మట్టి రోడ్డు వేశారని శుక్రవారం పాణ్యం విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మోడల్ స్కూల్‌‌కు విద్యార్థులు వెళ్లేందుకు సరైన రోడ్డు లేదని రోడ్డు వేయాలని ప్రజా, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 7, 2025 / 12:16 PM IST

విజయవాడలో భారీ దొంగతనం

NTR: విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్‌ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ. 2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.

February 7, 2025 / 12:14 PM IST

శివమాల దీక్షలో తిప్పేస్వామి బిక్షాటన

సత్యసాయి: మడకశిరలో శివమాల దీక్షలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి బిక్షాటన చేశారు. శివమాల దీక్షలో భాగంగా మాఘ మాసం సందర్భంగా పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి ఆయన బిక్షాటన చేశారు. వీరి వెంట పలువురు శివ మాలలో ఉన్న శివ స్వాములు కలిసి బిక్షాటనలో పాల్గొన్నారు.

February 7, 2025 / 12:07 PM IST