NRML: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మామడ మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించిన సన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, రేషన్ యజమానులకు పలు సూచనలు సలహాలు చేశారు.