కృష్ణా: పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని విజయ డెయిరీ వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ.. సామాన్య వర్గాలకు పౌష్టికాహారం దూరం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయవాడ విజయ డెయిరీ రెండు రూపాయలు చొప్పున పెంచిన పాల ధరలను తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది.