NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలోని వసాయ మార్కెట్ యార్డ్ నందు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.