కృష్ణా: ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు.