ATP: అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు వైసీపీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని వైసీపీ అనంతపురంజిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పస్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. అయినా 51 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందని తెలిపారు.