సత్యసాయి: సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్‌ను అరికట్టాలని ప్రజా సంఘాలు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మద్యం, జూదం, మట్కా పెరిగిపోతున్నాయని, మండలంలో ప్రశాంతతకు భంగం కలుగుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి నివాస ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి, యువతను రక్షించాలని కోరారు.