• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ: ఎస్పీ

GNTR: పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను పట్టుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

April 2, 2025 / 10:52 AM IST

గ్రంథాలయ పర్సన్ ఇన్ఛార్జిగా జేసీ నియామకం

NLR: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్‌ను నియమిస్తూ గవర్నర్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల పాటు కొత్త ఛైర్మన్ నియామకం అయ్యేంత వరకు శశిధర్ ఈ పదవిలో కొనసాగునున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే.

April 2, 2025 / 10:52 AM IST

రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

KMM: బోనకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..రైల్వే ట్రాక్‌పై దాదాపు 30 సం.యువకుడు మృతిచెంది కనిపించాడు. ఖమ్మం అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావు సహాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు

April 2, 2025 / 10:50 AM IST

‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

SRCL: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. కలెక్టరేట్ లో వర్ధంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నివాళులర్పించారు

April 2, 2025 / 10:38 AM IST

శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి వర్షాలు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని హెచ్చరించింది.

April 2, 2025 / 10:35 AM IST

జిల్లాకు రూ. 2.58 కోట్లు

NLR: జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటితొట్లు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు డ్వామా పీడీ గంగాభవానీ తెలిపారు. మనుబోలులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి ఆమె మాట్లాడారు. 964 నీటి తొట్టెల నిర్మాణాలకి రూ. 2.58 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.30 వేలు అందిస్తామన్నారు.

April 2, 2025 / 10:15 AM IST

ఎమ్మెల్యేకి ఆహ్వాన పత్రిక

MHBD: శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్‌కి హనుమాన్ భక్త మండలి ఆలయ కమిటీ వారు ఈ నెల 6న నిర్వహించే శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు బుధవారం మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గారు తప్పకుండా హాజరవ్వలని ఆయనను కోరారు.

April 2, 2025 / 09:18 AM IST

కుమార్తె కనిపించడం లేదంటూఫిర్యాదు

E.G: రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన ఓ యువతి (22) అదృశ్యమైంది. మార్చి నెల 20 తేదీ నుంచి ఆ యువతి ఆచూకీ కోసం తల్లి ఎంత ప్రయత్నించినా కనిపించలేదు. దీంతో తల్లి మంగళవారం బొమ్మూరు స్టేషన్ను ఆశ్రయించింది. ఆ తల్లి ఫిర్యాదు మేరకు బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

April 2, 2025 / 09:09 AM IST

బర్డ్‌ఫ్లూ వైరస్‌తో రెండేళ్ల చిన్నారి మృతి

AP: రాష్ట్రంలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ వైరస్‌తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ICMR అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం ఇదే తొలిసారి.

April 2, 2025 / 08:24 AM IST

జీబ్లీ ట్రెండ్‌లో విశాఖ అందాలు

VSP: ప్రపంచమంతా జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ ఫొటోలను AI ఇమేజ్‌లుగా మార్చుకొని సోషల్ మీడియాలో  పోస్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ అందాలను సైతం కొందరు జీబ్లీ ఇమేజ్‌లుగా మార్చారు. విశాఖలోని మెయిన్ సెంటర్స్, సింహాచలం దేవస్థానం, ఏయూ, బీచ్ రోడ్డు, కైలాసగిరి విజువల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

April 2, 2025 / 08:22 AM IST

నేడు సామాజిక తనిఖీ ప్రజావేదిక

ప్రకాశం: ఉపాధి హామీ 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను సంతమాగులూరులో బుధవారం నిర్వహిస్తున్నట్లు ఏపీఓ బాలకృష్ణనాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభంకానున్న ప్రజావేదికలో పాల్గొనాలని ఆయన కోరారు

April 2, 2025 / 07:55 AM IST

55 మంది శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ల విచారణ

NLR: నగర మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 55 మంది శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో కార్యాలయంలోని ఆరోగ్య విభాగంలో ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అవినీతి అక్రమాలు గుర్తించి ప్రభుత్వానికి అప్పట్లో నివేదిక అందించారు.

April 2, 2025 / 07:51 AM IST

హైకోర్టుకు మాజీ మంత్రి విడుదల రజిని

GNTR: ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

April 2, 2025 / 07:24 AM IST

‘కూటమి బండారాన్ని బయటపెడతాం’

ప్రకాశం: త్రిపురాంతకం మండల పరిషత్‌ ఎన్నికల విషయంలో కూటమి చేసిన అక్రమాలు, అరాచకాలను బయట పెడతామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. జిల్లా  జైలులో ఉన్న ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించి తాటిపర్తిలో మీడియాతో మాట్లాడారు. ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆంజనేయరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమేనన్నారు.

April 2, 2025 / 07:23 AM IST

సీతక్క పర్యటన విజయవంతం చేయాలి..

MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో బుధవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ రానున్నారు. ఈ సందర్భంగా వారి పర్యటనను గోవిందరావుపేట మండల, గ్రామ నాయకులు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ పిలుపునిచ్చారు.

April 2, 2025 / 07:14 AM IST