AP: రాష్ట్రంలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ వైరస్‌తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ICMR అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం ఇదే తొలిసారి.