BPT: అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభను పురస్కరించుకుని మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల సైకో పాలనలో అమరావతి హాహాకారాలు చుసిందని, కానీ ఇప్పుడది పునర్జన్మ పొందుతోందన్నారు. రాష్ట్ర ప్రజల కలల రాజధానిని మళ్లీ నిలబెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కుట్రలు, విషప్రచారాలపై విజయం సాధించామన్నారు.