వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్, వ్యాక్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి అయ్యేవి కానీ.. ఇప్పుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు. దీనిలో 90శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. మల బద్ధకం సమస్యను తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ ప్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది.