NZB: మహిళా సహకార సంఘాలు సమిష్టి కృషితో అన్ని రంగాల్లో రాణిస్తున్నాయని డీపీఎం మారుతి అన్నారు. నూతనంగా ఎన్నికైన జనరల్ బాడీ సభ్యులు అంకితభావంతో నిబద్ధతతో అందరూ కలిసికట్టుగా పనిచేసే సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో మండల మహిళా సమైక్య 19వ సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది.