KRNL: జిల్లాలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి మెడికల్ ఫిజిసిస్ట్, అనెస్తీషియా టెక్నీషియన్, అటెండెంట్ కేటగిరిల ఫైనల్ మెరిట్, సెలెక్షన్ లిస్ట్ శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 6 నుండి 8 మధ్య కర్నూలు మెడికల్ కాలేజీలో కౌన్సెలింగ్కు హాజరుకావాలని ప్రిన్సిపాల్ నరసమ్మ తెలిపారు.