GDWL: జోగులాంబ గద్వాల జిల్లాలో ఈనెల 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ బి.ఎం. సంతోష్ శనివారం తెలిపారు. మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న పరీక్షకు అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు.