NLR: మాలకోండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాలకొండపై జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.