MBNR: మరికల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్లో మృతి చెందింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు మండల కేంద్రానికి చెందిన తిరుపతమ్మ హోటల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూన్న క్రమంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడే మృతి చెందింది.