మహిళల వన్డే సిరీస్లో భాగంగా రేపు శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత ఓపెనర్ ప్రతీక ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం ఆమె వరుసగా ఐదు సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసింది. ఈ మ్యాచ్లో మరో హాఫ్ సెంచరీ సాధిస్తే వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత క్రికెటర్లు సచిన్, ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేయనుంది.