భారత్‌పై ప్రతీకారానికి పాక్ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు భారత్ ఆర్మీ పాఠశాలలు, సంక్షేమ వెబ్సైట్ల హ్యాకింగ్‌కు పాక్ హ్యాకర్లు కుట్ర పన్నారు. ఆర్మీ అధికారుల పిల్లలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించేందుకు యత్నిస్తున్నారు. వారి కుట్రను భగ్నం చేసిన ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు సంబంధిత విభాగాలను అప్రమత్తం చేశాయి.