HYD: టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ నూతన SHOగా బాధ్యతలు స్వీకరించిన బీ.అభిలాష్ ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. పీఎస్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో అంతఃకరణ శుద్ధితో తన విధులు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఏ సమయంలోనైనా తన నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రజలను కోరారు.