KMR: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి గ్రామంలో గత నెల 30న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేదించారు. శుక్రవారం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 30న దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద చిదుర కవిత(44) అనే మహిళను చీరతో ఉరి వేసి హత్య చేశాడు.