ప్రకాశం: ఒంగోలు మినీ స్టేడియంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి శుక్రవారం ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, బిఎన్ విజయకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణించే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ పాల్గొన్నారు.