ELR: నూజివీడు పట్టణంలోని అమర్ భవన్లో బోర్వంచ రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు చలసాని రామారావు మాట్లాడుతూ.. న్యూ జెన్ సీడ్ కంపెనీ మొక్కజొన్న విత్తనంతో రైతాంగం నష్టపోయినట్లు చెప్పారు. కంపెనీ రైతాంగానికి పరిహారం తక్షణమే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నిమ్మగడ్డ నరసింహ పాల్గొన్నారు.