ప్రకాశం: ఆడపిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశంలో శుక్రవారం కిశోర్ వికాసం బేటి బచావో-బేటి పడావో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 2నుంచి వచ్చే నెల 10వతేదీ వరకు ఆరోగ్యవంతమైన బాలికలు ఎదుగుదల కోసం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.