KKD: పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో అబ్బిరెడ్డి వర్షిత(21) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ బిడ్డను భర్త బాబ్జి, కుటుంబసభ్యులు కలిసి హింసించి చంపేసి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని మృతురాలు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.