ప్రస్తుతం సోషల్ మీడియాలో జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ ట్రెండ్‌ను ఓపెన్ఏఐ CEO శామ్ ఆల్ట్‌మన్ ఫాలో అయ్యారు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లతో తాను దిగిన ఓ ఫొటో జీబ్లీ వెర్షన్‌ను శామ్ నెట్టింట పోస్ట్ చేశారు. నాదెళ్లకు తన కొత్త ఆఫీస్‌ను చూపించానని, ఆయన సరదాగా గడిపారని తెలిపారు. దీనిపై స్పందించిన నాదెళ్ల.. ఆ ఆఫీస్ తనకు బాగా నచ్చిందని పేర్కొన్నారు.