NLR: పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్లో పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని మలిశెట్టి శివశంకర్ తొలగించారని పంచాయతీ కార్యదర్శి ఒగ్గు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. లేఅవుట్లో ప్రజావసరాల కోసం కేటాయించిన రిజర్వుడ్ స్థలం 286 అంకణాలు ఆక్రమణకు గురికావడంతో అధికారులు స్థలం కొనగూడదని హెచ్చరిక బోర్డు పెట్టారు.