ELR: గిరిజన నిరుద్యోగ యువతి కోసం ప్రభుత్వం ప్రత్యేక DSC ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో GO NO.3కి ప్రత్యామ్నాయంగా జీవో కోసం గిరిజన సలహా మండలి కమిటీ సభ్యులు అందరం కలిసి తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు.