కోనసీమ: కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సలాది స్వామి నాయుడు (అబ్బాయి కాపు) వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్బాయి కాపు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, పలువురు నేతలు పాల్గొన్నారు.