బాపట్ల: సంతమాగులూరు మండలం పాత మాగులూరు గ్రామంలో శుక్రవారం వేకువజామున ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ బలమైన గాలులకు బొప్పాయి తోటలు నేలకొరిగాయి. దీంతో పాత మాగులూరు, లక్ష్మీపురం, మిన్నెకల్లు, చవిటిపాలెం తదితర గ్రామాల రైతులు బొప్పాయి పంట నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.