• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాజీ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి

AP: మాజీ ఎమ్మెల్యే మనుమంతరాయచౌదరి మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హనుమంతరాయచౌదరి మతి పార్టీకి తీరనిలోటని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

March 21, 2026 / 12:35 PM IST

ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద గల తూప్రాన్ అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తూప్రాన్ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ ఆధ్వర్యంలో రేంజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని అంబర్ సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

March 21, 2026 / 12:34 PM IST

పశువుల రక్షణకు ఉచిత గాలికుంటు టీకా శిబిరం

NRPT: మాగనూర్ మండల పరిధిలోని తాళంకేరి గ్రామంలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు నరేందర్ సూచించినట్లు, పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే రైతులు తప్పనిసరిగా టీకాలు చేయించుకోవాలి. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది, పశువుల కాపరులు, స్థానిక రైతులు సజీవంగా పాల్గొన్నారు.

March 21, 2026 / 12:34 PM IST

పైనంపల్లి గ్రామంలో రంజాన్ పర్వదిన వేడుకలు

KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు భారీగా తరలివచ్చి సామూహిక నమాజ్ నిర్వహించారు. రంజాన్ పవిత్రతను, పేదలకు చేసే దానధర్మాల (జకాత్) ప్రాముఖ్యతను మత పెద్దలు వివరించారు.

March 21, 2026 / 12:33 PM IST

చిట్వేలిలో రంజాన్ వేడుకలు

అన్నమయ్య: చిట్వేల్‌లో పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం సోదరులు శనివారం ఈద్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు, పిల్లలు కొత్త దుస్తుల్లో పాల్గొని, సమాజంలో సౌహార్దం, ఐక్యతను చాటుతూ వేడుకలను ప్రశాంతంగా జరుపుకున్నారు.

March 21, 2026 / 12:32 PM IST

బీఆర్ఎస్ ఒత్తిడితో దిగివచ్చిన కాంగ్రెస్ సర్కార్: మాజీ మంత్రి

SDPT: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచిందని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న ,పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం వల్లే 25 శాతం మొక్కజొన్న పంట దళారుల పాలయ్యిందన్నారు.

March 21, 2026 / 12:31 PM IST

‘తోబుట్టువు, కన్నతల్లిని వేధించడమే జగన్ పాలసీ’

AP: ఆస్తిపాస్తుల్ని ప్రేమించు.. తోబుట్టువు, కన్నతల్లిని వేధించు అన్నదే జగన్ పాలసీ అని MLA ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్ హయాంలో ల్యాండ్ గ్రాబింగ్‌లు తప్ప.. ల్యాబ్‌లు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. ఎన్ని జన్మలెత్తినా పరిహారం పొందలేని ఘోరపాపానికి జగన్ ఒడిగట్టారని తెలిపారు. దేవునితో పరాచకాలు, పదవీకాంక్ష కుట్రలు.. జగన్ ఉనికికే ప్రమాదకరమని హెచ్చరించారు.

March 21, 2026 / 12:30 PM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గోరంట్ల

E.G: రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ప్రజల నుంచి పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

March 21, 2026 / 12:30 PM IST

ఖబురుస్తాన్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు

ATP: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పండుగ) సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం గుత్తిలోని ఖబరస్థాన్‌లో ముస్లిం సోదరులు, మత గురువులతో కలిసి తమ చనిపోయిన తమ ఆత్మీయులు, కుటుంబ సభ్యుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చనిపోయిన వారు దేవుని సన్నిధిలో శాంతిని పొందాలని ప్రార్థించారు.

March 21, 2026 / 12:30 PM IST

ద్వారపూడిలో ఘనంగా రంజాన్ వేడుకలు

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో ఘనంగా రంజాన్ పండుగ శనివారం నిర్వహించారు. ఈదుల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ ఇమామ్ కరిముల్లా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మానవాళికి శుభ సందేశం అందజేసేందుకు మహనీయ మహ్మద్ ప్రవక్త  దివ్య ఖురాన్ ను అవతరింపజేశారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికికొరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

March 21, 2026 / 12:30 PM IST

అక్షరాయుధాల గడ్డ.. మన కరీంనగర్!

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే సాహిత్యానికి పురిటిగడ్డ. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి మొదలుకొని, ఎందరో మహానుభావులు ఈ నేల సత్తాను చాటారు. నవ కవులకు మార్గదర్శిగా నిలుస్తున్న సాహిత్య వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నేటి తరం యువత కూడా సాహిత్య బాటలో నడిచి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని కోరుకుందాం.

March 21, 2026 / 12:30 PM IST

చెరువులో మొసళ్ల సంచారం.. గేదెలు మృతి

MNCL: జైపూర్ మండలం శివ్వారం ఎర్ర చెరువులో మొసళ్ల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన సారక్క, సంపత్ రెడ్డిలకు చెందిన 2గేదెలను మొసళ్లు చంపివేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చెరువు పరిసరాల్లో మొసళ్లు తిరుగుతుండటంతో పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా, నీటి కోసం వెళ్లాలన్నా భయపడుతున్నామని గ్రామస్థులు వాపోయారు.

March 21, 2026 / 12:30 PM IST

పట్టాదారు పాసు బుక్కులు అందజేసిన ఎమ్మెల్యే

KKD: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు భూమి పట్టాదారు పాసు బుక్కులు శనివారం అందజేశారు. దేవరపల్లి మండలం యాదవోలులో కొల్లూరు సుబ్బమ్మకి చెందిన 14 ఎకరాల భూమిని 1982 సంవత్సరం నుంచి పాస్ పుస్తకాలు లేకుండా పేదలు వినియోగిస్తున్నారు. దీంతో పట్టదారులు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పట్టదారులకే భూమి చెందుతుందని కోర్టు ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

March 21, 2026 / 12:30 PM IST

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

WNP: పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు పశు సంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్ సురేశ్ శనివారం తెలిపారు. పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం ద్వారా పశువుల మరణాలను తగ్గించవచ్చని అన్నారు. పాల ఉత్పత్తి తగ్గిపోకుండా కాపాడుకోవచ్చని, రైతులకు టీకాల గురించి అవగాహన కల్పించారు.

March 21, 2026 / 12:30 PM IST

రంజాన్ వేడుకల్లో సీపీ సజ్జనార్

TG: HYDలోని మీరాలం ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనల్లో సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనలు ముగిసాక అక్కడి ముస్లిం సోదరులను కలిసి ఆత్మీయంగా రంజాన్ శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలియజేశారు. పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, నగరంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 12:29 PM IST