KMM: తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో వరి గడ్డి వాము దగ్ధమైంది. గ్రామంలోని సొసైటీ బజారులో ఉన్న, కర్నాటి దుర్గకు చెందిన నాలుగు ఎకరాలకు చెందిన వరిగడ్డిని వాము వేసి ఉంచారు. దానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయిందని బాధితురాలు వాపోయారు. దీంతో పశువులకు మేత లేకుండా పోయిందని, రూ.40వేల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
KMM: నగరంలోని టీడీపీ ఆఫీస్ పక్కన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ఆవరణలో గ్రామభారతి, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 8న మెగా ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నల్లమల వెంకటేశ్వరరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు.
GNTR: విద్యార్థులు నిరంతర అధ్యయనంతో ఏదైనా సాధించవచ్చునని ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్లేబాక్ సింగర్ ఎస్.ఎస్.తమన్ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తమన్ మాట్లాడుతూ.. జీవితంలో ఏవైనా కొత్తవి నేర్చుకోవడానికి ఆలస్యం చేయవద్దని సూచించారు.
GNTR: సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో జిల్లా మంత్రులు నాదెండ్ల మనోహర్‌కు 4 ర్యాంకు రాగా, లోకేష్‌కు 8వ ర్యాంకు పొందారు.
GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. పోలవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిర్రి బాలరాజు వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, వీరమహిళ రావి సౌజన్య ఉన్నారు.
GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు. డ్రైనేజీ కెనాల్ దగ్గర మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఆచూకీ తెలిసినవారు చేబ్రోలు పోలీసులను సంప్రదించాలని కోరారు.
ELR: ఉంగుటూరు మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూలు చేస్తామని ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలాఖరకు నూరు శాతం పన్ను వసూలు చేసే లక్ష్యంగా పంచాయితీ కార్యదర్శులు పనిచేయాలన్నారు. మొండి బకాయి దారులకు కార్యదర్శులు నోటీసులు జారీ చేసి పన్ను వసూలు చేయాలన్నారు.
GNTR: గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలుపుకు కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి విడదల రజిని హాజరుకావాలని గురువారం ఆర్యవైశ్యులు ఆమె నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఈనెల 8వ తారీఖున జరుగుతుందని తెలిపారు.
ELR: ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో గురువారం సంచార హెచ్ఐవి సలహా మరియు పరీక్ష కేంద్రము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు, గర్బిణి స్త్రీలకు, ట్రాన్స్ జెండర్లకు మరియు యువతకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించచారు. జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. హెచ్ఐవి సలహా పరీక్ష కేంద్రాలను ఉపయోగించుకోవాలన్నారు.
NLR: కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్ర(KVC)లో గురువారం SCసబ్ ప్లాన్ క్రింద మహిళా రైతులకు కూరగాయల విత్తనాలను, గొర్రెల దాణాను ఉచితంగా పంపిణీ చేశారు. రాజమండ్రిలోని జాతీయ వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ గురువారం కందుకూరు KVCని పరిశీలించిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ELR: జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహిళా అభయ రక్షక దళం ప్రత్యేక గస్తీలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం మహిళా పోలీస్ స్టేషన్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రముఖ బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల సమీపం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో నిరంతరం గస్తీలు నిర్వహిస్తున్నారు.
NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి జడ్పీ హైస్కూల్లో గురువారం కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కౌమారదశలో ఎదురయ్యే మార్పులపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం జీవీ రమేశ్ బాబు, డీపీఎమ్ ఎం.మోహన్ రావు, వైద్య సిబ్బంది జి. విమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
MDK: తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌లను మంత్రి దామోదర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. వ్యాధుల, చికిత్సల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆఫీసర్ల పాత్ర కీలకమైందన్నారు.
ప్రకాశం: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్ ఏర్పాటు చేయాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లోని అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల ఫిర్యాదులను విని వాటికి పరిష్కార మార్గం చూపాలని ఆయన ఆదేశించారు.