AP: తను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. తను ఎక్కడికి వెళ్లలేదని.. ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. తను నెల్లూరులో లేని టైంలో తన ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించారని చెప్పారు. బెయిల్ రాకుండా చేసేందుకే SC, ST కేసు నమోదు చేశారని.. ఇటువంటి కేసులకు బయపడే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా ఉన్న టైంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు.