AP: కేంద్ర సహకారంలో 2027కి పోలవరం పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు రాష్ట్రంలో నదులు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రామాయపట్నంలో బీపీఎల్ రిఫైనరీ వస్తుందన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చెందుతుందని, కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుందని పేర్కొన్నారు.