పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామని చౌధ్రీ అన్వర్ ఉల్హక్ అసెంబ్లీలో వెల్లడించారు.ఆహారం, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా స్థానిక ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.