AP: అమరావతిలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తల్లి దుర్గాభవానీ కొలువున్న పుణ్యభూమిపై అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి’ అని తెలుగులో అన్నారు. అమరావతి అంటే సాంప్రదాయ నగరం అని తెలిపారు. అమరావతిలో ప్రారంభించిన పనులు కేవలం కాంక్రీట్ పనులు మాత్రమే కావు.. ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు బలమైన పునాదులు వేయబోతున్నాయన్నారు.