నటుడు మాధవన్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకానొక సమయంలో తీరిక లేకుండా పని చేయాల్సి వచ్చింది. ఆ విసుగుతో నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి, కేరళ వీధుల్లో తిరిగేవాడిని. పొటాటో, పప్పుల ధరలెంత? ప్రజలు వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలనుకున్నా. గడ్డం పెంచి, దేశం మొత్తం తిరిగా’ అని పేర్కొన్నాడు.