SRCL: HCU భూముల విక్రయం విరమించుకోవాలని BRSV నేత పోతు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400ఎకరాలు అన్యాక్రతం అవుతున్న దానికి విద్యార్థులు చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకొని విద్యార్థుల పై దాడి చేస్తూ కనీసం మహిళలు అని కూడా చూడకుండా వారిని అరెస్టు చేశారన్నారు.