WGL: వర్ధన్నపేట బస్టాండ్ సమీపంలో గంజాయిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 25 కిలోల శుద్ధి గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ధన్నపేట బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.