TG: సన్నబియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సన్నబియ్యం పథకంలో కేంద్రం వాటా ఉందని బండి సంజయ్ చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. రూ.500కే గ్యాస్, సన్నబియ్యం దేశంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.