సీఎం సిద్ధ రామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) కేసు CBIకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై లోకాయుక్త చేపట్టిన దర్యాప్తు పునఃపరిశీలన కోసం సీబీఐకి సూచించటానికి తమకు అర్హత లేదని తెలిపింది. కాగా.. సీఎం భార్య పార్వతికి అక్రమంగా ముడా 14 ఎకరాల స్థలం కేటాయించిందనే ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదైంది.
యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలో విమానం అదృశ్యమైన ఘటన వెలుగుచూసింది. అలస్కా మీదుగా వెళ్తున్న విమానం కనిపించకుండా పోయింది. ఈ మేరకు అధికారులు దాని ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ విమానంలో ఓ పైలట్, 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: కౌతాళం మండలం ఉప్పరహల్ గ్రామంలో శ్రీ దేవమ్మ అవ్వ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు అధ్వర్యంలో దేవాలయం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో టీడీపీ నేతలు చెన్నబసప్ప ధని, టిప్పు సుల్తాన్ ఉన్నారు.
W.G: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టాలపై పడుకోవడంతో తల తెగి పడింది. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమణ తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
కృష్ణా: కుమార్తె అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్తపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. టైనర్‌పేటకు చెందిన సుకన్య కబేల వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5 ఉదయం ఇంటి నుంచి ఉద్యోగానికి అని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి శ్రీనివాసరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
NTR: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రుల ర్యాంక్‌లలో 7వ స్థానంలో ఉన్నారు. ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా గురువారం సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రుల ర్యాంక్‌లు విడుదల చేయగా సత్యకుమార్ ఆ జాబితాలో 7వ స్థానం పొందారు. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర 12, కె.పార్థసారథి 23వ స్థానాల్లో ఉన్నారు.
NLR: నగరంలోని పలుచోట్ల వేర్వేరు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు. తల్లి తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటనతో పాటు, కొడుకులను తీసుకొని తండ్రి అదృశ్యమైన మరో ఘటనపై చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం కావడంతో నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు అయింది.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కోష్ట జాతీయ రహదారి పక్క శ్రీ కృష్ణ చైతన్య మఠం వారి గోశాల, శ్రీ రాధా గోవిందా గోకులానంద ఆశ్రమంలో శ్రీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రతిష్ట కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తు శ్రీ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, సాధువులు, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
SRPT: చేరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అగ్నిగుండంపై నడిచారు. వారు సమర్పించిన కట్నాలు రూ.1,03,350, హుండీ ఆదాయం రూ.60,580 వచ్చినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు.
NTR: విజయవాడ డివిజన్లో పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. SHM-HYD (18045) SHM-MGR (12841), DHN-ALLP(13351), SRC-MGR(22807) TATA-SBC(12889) ఎక్స్‌ప్రెస్ రైలు నిడదవోలు గుడివాడ విజయవాడ మీదుగా సీఎస్‌టీ ముంబై భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
KMM: నగరపాలక సంస్థ కార్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో డీబీ సెక్షన్‌కు సంబంధించి కొన్ని ఫైళ్లు కనిపించడం లేదని ఇటీవల గుర్తించారు. ఓ వర్క్ ఇన్స్పెక్టర్ ఫైళ్లను బయటకు తెప్పించినట్లు తెలియగా, అందుకు అటెండర్ రాజేశ్వరిని అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. అలాగే, వర్క్ ఇన్స్పెక్టర్ పై చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది.
NLG: ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈ నెల 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ 2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తం రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు.
SRCL: మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు చంపుతానని బెదిరించిన బోయినపల్లికి చెందిన రాజుకు జడ్జి ఏడాది జైలు శిక్ష, రూ. 7వేలు జరిమానా విధించినట్లు SI పృథ్వీధర్ గౌడ్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన స్వప్న తనపై రాజు అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను, ఆమె కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించినట్లు 2016, జనవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది.