KMM: ఆరు గ్యారెంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాల్ రావు అన్నారు. బుధవారం బోనకల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పరిశ్రమల స్థాపన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం HUCభూములను ప్రైవేట్ తరం చేయడం సరికాదన్నారు. అనంతరం తహసీల్ధార్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.