NLR: జలదంకి మండలం కృష్ణంపాడులో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు దాడులు నిర్వహించారు. సీఐ సుంకర శ్రీనివాసులు సూచనల మేరకు ఎస్సై దేవిక సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న గోని అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.