E.G: రాజమహేంద్రవరం కార్పొరేషన్ పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాల పై వేసే పన్నులతో పాటు ఇతర పన్నులతో కలిసి రూ.65.19 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. చివరి రోజున హౌస్ ట్యాక్స్ రూ.2.19 కోట్లు, ఖాళీ స్థలాల పన్నులు రూ.44.87లక్షలు, వాటర్ ఛార్జిలు రూ.24 లక్షలు వసూలయ్యయి.