HYD: టాంకర్ బుకింగ్.. డెలివరీలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జీఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వరుసగా వచ్చిన సెలవులతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ బుకింగ్ల పెండింగ్ పెరిగినట్టు రానున్న 2 రోజులు అదనపు గంటలు పనిచేయడానికి ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించారు. రెండు షిఫ్టుల్లో ట్యాంకర్ డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలన్నారు.