కృష్ణా: విజయవాడ ఆటోనగర్లో మంగళవారం రాత్రి లక్ష్మీ అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ పడి ఉన్న ప్రాంతాన్ని ఏసీపీలు పవన్ కిషోర్, దామోదర్ పరిశీలించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. భర్త మహంకాళి పరారీలో ఉన్నట్టు చెప్పారు.