JN: సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతిని పురస్కరించుకుని లింగాల ఘన్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాన్ని ఎమ్మెల్యే ప్రజలకు గుర్తు చేశారు.