హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, శాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో సీ. సుప్రీత్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘టుక్ టుక్’. ఇది ఈ నెల 10 నుంచి ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు సినిమాలు సదరు సంస్థలో రిలీజ్ కాబోతున్నాయి. రేపు ‘ఉద్వేగం’ మూవీ విడుదల కానుండగా.. ‘కొత్త కొత్తగా’ అనే మూవీ ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉండనుంది.