ఖమ్మం: రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌ను టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులు కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. జర్నలిస్టులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కాబట్టి వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలన్నారు.