E.G: రాజానగరం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. సీతానగరం నుంచి పురుషోత్తపట్నం వరకు రోడ్డు వేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.