PDPL: మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టును నియమించినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డాక్టర్ బి.సోని విధుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో స్త్రీ వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిసర ప్రాంత మహిళలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.